Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'విజేత'గా చిరూ చిన్నల్లుడు .. టాకీ పార్ట్ పూర్తి

  • 'విజేత'గా కల్యాణ్ దేవ్ 
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • జూలైలో ప్రేక్షకుల ముందుకు
చిరూ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్  హీరోగా 'విజేత' సినిమా రూపొందుతోంది. వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఆ తరువాత పనులను చకచకా పూర్తి చేసుకుని, జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

నటనలోను .. డాన్స్ .. ఫైట్స్ లోను కల్యాణ్ ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. గతంలో చిరంజీవి హిట్ కొట్టిన 'విజేత' టైటిల్ ను సెట్ చేసుకుని సగం మార్కులను అక్కడే కొట్టేశాడు. ఈ సినిమా ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు తెచ్చుకున్న ఈ హీరో, ఇక నటన .. డాన్స్ .. ఫైట్స్ విషయంలో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. 
kalyan
malavika nair

More Telugu News